అక్షరటుడే, వెబ్డెస్క్ : TET | డైట్, బీఈడీ చేసి టీచర్ కొలువు కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు టెట్TET నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఈ నెల 15 నుంచి 30 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు applications చేసుకోవచ్చు. జూన్ 15 నుంచి 30 మధ్య టెట్ పరీక్షలు tet exams నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. జూలై 22న ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది. ఒక పేపర్ అయితే రూ.750, రెండు పేపర్లు అయితే రూ.వెయ్యి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదికి రెండుసార్లు టెట్ నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా గత డిసెంబర్లో టెట్ పరీక్ష నిర్వహించగా తాజాగా మళ్లీ నోటిఫికేషన్ వేసింది.