Farmers | పత్తి సేకరణలో తెలంగాణ టాప్​

Farmers | పత్తి సేకరణలో తెలంగాణ టాప్​
Farmers | పత్తి సేకరణలో తెలంగాణ టాప్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Farmers | పత్తి(Cotton) కొనుగోళ్లలో ఈ ఏడాది తెలంగాణ(Telangana) రికార్డు సాధించింది. గుజరాత్​(Gujarath), మహారాష్ట్ర(Maharashtra)ను వెనక్కి నెట్టి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2024-25 సాగు సీజన్లో రాష్ట్రంలోని పత్తి రైతుల నుంచి భారత పత్తి సంస్థ (CCI) 40.37 లక్షల బేళ్ల పత్తిని సేకరించింది. దేశవ్యాప్తంగా కోటి 15 వేల బేళ్ల పత్తి సేకరించగా.. అందులో 40శాతం తెలంగాణ నుంచే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో 30 లక్షల బేళ్లు, గుజరాత్​లో 14 లక్షల బేళ్ల పత్తి సేకరించినట్లు సీసీఐ తెలిపింది.

Advertisement
Advertisement

Farmers | కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయం

పత్తి రైతులు ఈ ఏడాది తమ పంటను ఎక్కువ శాతం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. రైతులకు అందుబాటులో ఉండేలా ఎక్కువ మొత్తంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 302 సెంటర్ల ద్వారా పత్తి సేకరించారు. దీంతో పాటు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడం, కొర్రీలు పెడుతుండటంతో రైతులు తమ పంటను సీసీఐ కేంద్రాల్లో విక్రయించారు. దీంతో ఈ ఏడాది వ్యాపారులు కేవలం 8.51 లక్షల బేళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేశారు. పత్తి క్వింటాల్​కు రూ.6,800 నుంచి రూ.7,200 వరకు ధర లభించింది.

ఇది కూడా చ‌ద‌వండి :  Telangana MLC | ప్రమాణస్వీకారం చేసిన కొత్త ఎమ్మెల్సీలు

Farmers | తగ్గుతున్న సాగు విస్తీర్ణం

రాష్ట్రంలో ఏటా పత్తి సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. మూడేళ్ల కిత్రం 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవగా ఈ ఏడాది 43 లక్షల ఎకరాలకు పడిపోయింది. అయితే గత రెండేళ్ల కంటే ఈ ఏడాది దిగుబడి ఎక్కువ రావడం గమనార్హం. గతంలో వర్షాలు, తెగుళ్లతో దిగుబడి పడిపోయింది. ఈ ఏడాది మాత్రం పత్తి పంట బాగా పండింది. రాష్ట్రంలో నల్గొండ(Nalgonda) జిల్లాలో అత్యధికంగా పత్తి సాగు చేస్తున్నారు.

Advertisement