అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్ అజయ్‌కుమార్‌ తనిఖీ చేశారు. ఆయన శనివారం జీజీహెచ్‌ను సందర్శించి వసతులను పరిశీలించారు. ఫీవర్, ఇతర వార్డుల్లో తిరుగుతూ రోగులకు అందుతున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వైద్యులతో సమావేశమయ్యారు. సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ పవర్‌ పాయింట్‌ ద్వారా ఆస్పత్రికి అవసరమైన మౌలిక వసతులు, ఇతర అంశాలను ఆయనకు వివరించారు. కమిషనర్ స్పందిస్తూ వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో రాజశ్రీ, డీసీహెచ్‌ఎస్‌ శ్రీనివాస్, సర్వేలెన్స్‌ అధికారి నాగరాజు ఉన్నారు.