అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశంలోని టెలీకాం సంస్థలు కస్టమర్లకు షాకిచ్చాయి. టారిఫ్ ప్లాన్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జియో ఇప్పటికే పెంపును ప్రకటించగా.. తాజాగా ఎయిర్‌టెల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది. జూలై 3 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. ఇక జియో తన మొబైల్ సేవల టారిఫ్‌లను 12 – 27 శాతం పెంచగా, ఎయిర్‌టెల్ ప్లాన్ల రకం, వ్యాలిడిటీ ఆధారంగా 10 – 21 శాతం పెంచాయి. దీంతో ఇతర సంస్థలు సైతం టారిఫ్ ప్లాన్లను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటించిన సంస్థలు.. అంతే పోటీగా టారిఫ్ రేట్లను పెంచుతుండటంపై వినియోగదారులు పెదవి విరుస్తున్నారు.