అక్షర టుడే, వెబ్ డెస్క్ OTT : థియేటర్‌లో రిలీజైన కొద్ది రోజులకే పలు చిత్రాలు ఓటీటీOTTలో సందడి చేసి ప్రేక్షకులకి మంచి మజా అందిస్తున్న విషయం తెలిసిందే. . తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో హిట్ అయిన చిత్రాలను ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చాయి. ఈ శుక్రవారం అడియన్స్ ముందుకు తెలుగులో సూపర్ హిట్ అయిన కోర్ట్, ఛావా చిత్రాలు వచ్చేశాయి. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. గత అర్దరాత్రి నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
OTT : ఓటీటీలో సందడే సందడి..
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, (Vicky Kaushal) నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandann)జంటగా నటించిన లేటేస్ట్ హిట్ మూవీ ఛావా. ఈ చిత్రం ఎంత పెద్ధ విజయం సాధించిందో మనందరికి తెలిసిందే, చత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఇందులో తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు విక్కీ కౌశల్. ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది. గత అర్దరాత్రి నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన ఛావా సినిమా ఇప్పుడు ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ మూవీ కేవలం హిందీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ షణ్ముఖ సైతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో ఆది సాయి కుమార్, అవికా గోర్ జంటగా నటించారు. అలాగే తమిళంలో వచ్చిన కామెడీ మూవీ పెరుసు సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. మలయాళ చిత్ర సౌబీన్ షాహిర్, బాసిల్ జోసెఫ్, చెంబన్ వినోద్ జోష్ నటించిన చిత్రం ప్రావిన్‌కూడు షాప్పు. డార్క్ కామెడీగా, మర్డర్ మిస్టరీగా రూపొందిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీకి శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏప్రిల్ 11వ తేదీన సోని లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.ఇవే కాకుండా డాక్టర్ 2 ఏప్రిల్ 12వ తేదీన, బిహైండ్ ది కర్టైన్: స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ఏప్రిల్ 15వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో, ది గ్లాస్ డోమ్ చిత్రం ఏప్రిల్ 15వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో Netflix రిలీజ్ కానున్నది. ఇంకా పలు ఓటీటీల్లో భారీగా ఈ వారం స్ట్రీమింగ్ అవుతూ సమ్మర్ సెలవుల్లో ప్రేక్షకులకు మంచి వినోదం పంచనున్నాయి.