అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy | రామారెడ్డి మండల కేంద్రంలో సీతారామ-శ్రీ రాజరాజేశ్వర స్వామి(Sitarama-Sri Rajarajeshwara Swamy) ఆలయాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం ఉదయం 5 గంటలకు దేవతామూర్తుల విగ్రహాలను రెండు రథాలపై ఊరేగించారు. యువకులు, గ్రామస్థులు రథాలను స్వయంగా లాగి భక్తిని చాటుకున్నారు.
ఇళ్ల వద్దకు రథం రాగానే మహిళలు నీళ్లు పోసి ఉత్సవమూర్తులకు మంగళ హారతులిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.