అక్షరటుడే, బాన్సువాడ: Banswada | పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని విద్యార్థి నాయకులు బాన్సువాడ ఎంఈవో నాగేశ్వరరావుకు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐఎస్బీ జిల్లా అధ్యక్షుడు బైరాపూర్ రవీందర్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దత్తు బాన్సువాడ మండల విద్యాధికారి నాగేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు. చూచిరాత జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి తరగతి గదిలో ఫ్యాన్స్ ఉండే విధంగా చూడాలన్నారు. పరీక్ష సమయాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూడాలని కోరారు.