అక్షరటుడే, వెబ్​డెస్క్​: కొడంగల్‌ నియోజకవర్గంలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం భూములు సేకరించడానికి శుక్రవారం అధికారులు దుద్యాల మండలం రోటిబండ తండాకు వచ్చారు. తమ భూములు ఇచ్చేది లేదంటూ తండావాసులు నిరసన తెలిపారు. 200 మంది పోలీసులు తండాలో మోహరించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటీవల లగచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కలెక్టర్​, ఇతర ఉన్నతాధికారులపై గ్రామస్థులు దాడికి దిగిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement