Lingampet | ఫ్లెక్సీ వివాదం.. లింగంపేటలో సంఘాల నిరసన

Lingampet | ఫ్లెక్సీ వివాదం.. లింగంపేటలో సంఘాల నిరసన
Lingampet | ఫ్లెక్సీ వివాదం.. లింగంపేటలో సంఘాల నిరసన

అక్షరటుడే, ఎల్లారెడ్డి:Lingampet |ఫ్లెక్సీ తొలగింపు వివాదం కారణంగా లింగంపేట(Lingampeta) మండల కేంద్రంలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట మండల కేంద్రంలో అంబేడ్కర్​ జయంతి(Ambedkar Jayanti) సందర్భంగా వివిధ పార్టీల నాయకులతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే పంచాయతీ సిబ్బంది వాటిని తొలగించడంతో అంబేడ్కర్​ సంఘం నాయకులు నిరసన తెలిపారు.

Advertisement
Advertisement

ఈ క్రమంలో పోలీసులు, సంఘాల సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం సీఐ(CI) తమపై దురుసుగా ప్రవర్తించాడని పేర్కొంటూ నాయకులంతా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు(Police) లింగంపేట మాజీ ఎంపీపీ ముదాం సాయిలు తదితరులను స్టేషన్​కు తరలించారు. దీంతో అంబేడ్కర్​ సంఘం నాయకులు చౌరస్తాలోనే విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Alfazolam | అల్ఫాజోలం పట్టివేత