Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిర్మల్‌ జిల్లా దిలావపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్మల్‌- భైంసా హైవేపై స్థానికులు రెండో రోజూ ఆందోళన కొనసాగించారు. మహిళలు పురుగుల మందు డబ్బాలతో నిరసనలో పాల్గొన్నారు. కొందరిని ముందస్తు అరెస్టు చేయడంతో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. ఇథనాల్‌ పరిశ్రమ అంశాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ వచ్చే వరకు తమ నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. కలెక్టర్‌ రాకపోతే ఇక్కడే పురుగుల మందు తాగి చనిపోతామని హెచ్చరించారు.

Advertisement