Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: వరంగల్​ మామునూరు ఎయిర్ పోర్టు దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరంగల్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వేర్వేరుగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారు. అయితే ఒకే సమయంలో ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు దగ్గరకు రెండు పార్టీల కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోటాపోటీగా ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ, రేవంత్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకాలు చేశారు. రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు.

క్రెడిట్​ కోసం పోటీ..

కేంద్రం మామునూర్ విమానాశ్రయానికి అనుమతి ఇవ్వడంతో కాంగ్రెస్​, బీజేపీ అప్పుడే క్రెడిట్​ కోసం పోటీ పడుతున్నాయి. మోదీతోనే ఎయిర్​పోర్టు వచ్చిందని బీజేపీ వారు, రేవంత్​రెడ్డి కృషితోనే సాధ్యమైందని కాంగ్రెస్​ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్​పోర్టు వద్ద రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Rahul Gandhi | సొంత పార్టీ నేతలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

సీఎంను కలిసిన ప్రజాప్రతినిధులు

మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు కావ్య, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి సీఎంను కలిసి ఎయిర్​పోర్టు కోసం కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement