పరీక్షల భయంతో.. హాస్టల్ భవనం నుంచి దూకిన విద్యార్థిని

0

అక్షరటుడే, బాన్సువాడ: మరికొన్ని గంటల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరీక్షల భయంతో హాస్టల్ భవనం పైనుంచి దూకింది. బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల హాస్టల్ లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం సమయంలో విద్యార్థిని భవనం మొదటి అంతస్తు పైనుంచి దూకగా.. సిబ్బంది హుటాహుటిన విద్యార్థినిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. విద్యార్థినికి స్వల్ప గాయాలు కాగా పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.