అక్షరటుడే, న్యూఢిల్లీ: Terrible weather : దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో భీతావాహ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం ఎండతో ఉక్కపోత పోయగా.. సాయంత్రం దట్టబైన క్యుములోనింబస్ మేఘాలు(cumulonimbus clouds ) కమ్ముకున్నాయి. ఈదురుగాలులకు తోడు దుమ్ముదూళి గాల్లోకి లేచి భీతి గొలిపింది.
పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో గాలిదుమారం(dust, dust rose) బీభత్సం సృష్టించడంతో ఢిల్లీవాసులు ఇబ్బందిపడ్డారు. దుమ్ము దూళి గాల్లోకి లేవడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.
భీకరమైన ఈదురు గాలులతో చాలాచోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్తు స్తంభాలు దెబ్బతిని, కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా చాలాచోట్ల అంధకారం నెలకొంది. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుని చీకట్లు అలుముకోవడంతో విమాన సర్వీసులకు సైతం అంతరాయం ఏర్పడింది.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్(Delhi Airport) నుంచి నడిచే 15 విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. చాలా విమానాలు ఆలస్యంగా నడిచిన దుస్థితి. రాత్రంతా భీతికర వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.