అక్షరటుడే, హైదరాబాద్: TG TET : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Telangana Teacher Eligibility Test) (టీజీ టెట్ 2025 ) 2025 నోటిఫికేషన్ ఈ నెల 11 (శుక్రవారం)న విడుదలైంది. ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ ఈ ఏడాది మొదటి సెషన్ నోటిఫికేషన్ ను జారీ చేసింది.
ఏప్రిల్ 15 నుంచి ఆన్‌లైన్ లో టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 30 వరకు కొనసాగనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల విధానంలో టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుంది. పరీక్ష 2.30 గంటలపాటు నిర్వహిస్తారు.