అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : టీజీపీఎస్సీ మీ తల్లిలాంటిదని ఎలాంటి అపోహలు లేకుండా, ప్రశాంతంగా గ్రూప్‌-2 పరీక్షలు రాయాలని అభ్యర్థులకు కమిషన్‌ ఛైర్మన్‌ బుర్రవెంకటేశం చెప్పారు. రేపు, ఎల్లుండి జరిగే గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌పై విశ్వాసం, అభ్యర్థులు వారి మెరిట్‌పై నమ్మకం ఉంచి పరీక్షలు రాయాలని సూచించారు. ప్రతి అభ్యర్థికి తమకు కేటాయించిన ఓఎంఆర్‌షీట్‌ను పక్కాగా చేసుకోవాలన్నారు. బయోమెట్రిక్‌ లేకుండా పరీక్ష రాసేందుకు వీలు లేదన్నారు.

టీజీపీఎస్సీ ప్రక్షాళన కోసం డీల్లీకి..

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రక్షాళన కోసం ఈనెల 18,19 తేదీల్లో టీజీపీఎస్సీ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నామని తెలిపారు. 18న ఉదయం యూపీఎస్సీ కార్యాలయంలో,19న ఎస్‌ఎస్‌సీ కమిషన్‌ కార్యాలయంలో అధికారులతో భేటీ అవుతామని పేర్కొన్నారు. పారదర్శకంగా పరీక్షల నిర్వహణ కోసం అధ్యయనం చేసేందుకు ఈపర్యటన ఉంటుదన్నారు.