అక్షరటుడే, ఇందూరు: విద్యారంగంలో జిల్లా వెనుకబడి ఉందని టీజీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భానుచందర్ అన్నారు. శనివారం విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా జిల్లాకు ఎటువంటి కళాశాలను ఏర్పాటు చేయకుండా మొండిచేయి చూపిస్తున్నాయన్నారు. ఏఐఎస్ఎఫ్ నాయకుడు రఘురాం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కుటుంబ పాలనకే పరిమితమైందని, ప్రస్తుత ప్రభుత్వమైనా జిల్లాకు వెటర్నరీ కళాశాలను కేటాయించాలన్నారు. సమావేశంలో అనిల్, లాల్ సింగ్, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.