అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Waqf Board | కేంద్ర ప్రభుత్వం ఇటీవల వక్ఫ్ సవరణ చట్టం Waqf Amendment Act తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వక్ఫ్ బోర్డు Waqf Board సామాన్యుల భూమిని లాక్కుంటుందని ఆరోపిస్తూ పాత చట్టానికి సవరణలు చేశారు. తాజాగా తమిళనాడు(Tamil Nadu)లోని వెల్లూరులో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.
కొన్ని దశబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న ఊరిని వక్ఫ్ బోర్డు తమ ఆస్తిగా పేర్కొంది. అంతేగాకుండా ఆ గ్రామంలోని 150 కుటుంబాలకు నోటీసులు పంపడం గమనార్హం. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
తమిళనాడులోని వెల్లూరు జిల్లా కొట్టుకొల్లై kottukilai గ్రామంలో 150 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ గ్రామాన్ని రాష్ట్ర వక్ఫ్ బోర్డు తనదిగా పేర్కొంది. ఈ మేరకు గ్రామస్థులకు నోటీసులు కూడా పంపింది. దీంతో ఆందోళన చెందిన గ్రామస్థులు మంగళవారం కలెక్టర్(collector)ను కలిసి తమ సమస్యను వివరించారు. ఈ గ్రామభూమి స్థానిక దర్గాకు చెందినదని, అన్ని కుటుంబాలు వెంటనే ఖాళీ చేయాలని సయ్యద్ అలీ సుల్తాన్ షా నోటీసులు పంపారని వారు పేర్కొన్నారు.
కాగా.. ఆ గ్రామంలో నాలుగు తరాలుగా తమ కుటుంబాలు నివసిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. భూమికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన పత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పారు. వక్ఫ్ బోర్డు నోటీసులు పంపడంపై స్పందించాలని కలెక్టర్‌ను కోరారు.