అక్షరటుడే, వెబ్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్-20 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాన్ మస్క్ అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ దీనిని మోసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనావెరల్ కేంద్రం నుంచి దీనిని నింగిలోకి పంపారు. వాణిజ్యపరంగా ఇస్రో, స్పేస్‌ఎక్స్ మధ్య ఇది తొలి ప్రయోగం కావడం గమనార్హం. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించే లక్ష్యంగా దీనిని ప్రయోగించారు.