Advertisement

అక్షర టుడే, వెబ్ డెస్క్: మేడ్చల్ సీఎంఆర్ కాలనీలో విద్యార్థులు నిన్నటి నుంచి కొనసాగించిన ఆందోళన సద్దుమణగడం లేదు. బాత్ రూంల్లో విద్యార్థినుల పర్సనల్ వీడియోలను చిత్రీకరించినట్లు ఆరోపణలున్నాయి. వీటి ద్వారా విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అలాగే 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మహిళా సెక్యూరిటీ గార్డులను నియమించాలని, వార్డెన్ ను మార్చాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement