అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మహిళలకు ఫ్రీ బస్‌ సౌకర్యంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పథకం అమలులో ఉన్న రాష్ట్రాల్లో పర్యటించడానికి మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ రవాణా శాఖ మంత్రి ఛైర్మన్‌గా.. హోం మంత్రి, మహిళా శిశు సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులను ఈ కమిటీలో సభ్యులుగా చేర్చింది. కన్వీనర్‌గా రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీని నియమించింది. వీలైనంత త్వరగా సదరు రాష్ట్రాల్లో పర్యటనలు ముగించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 2025 జనవరి 2న నిర్వహించనున్న ఏపీ కేబినెట్‌ సమావేశంలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement
Advertisement