అక్షరటుడే, వెబ్‌ డెస్క్‌: డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. వర్మను వచ్చే సోమవారం వరకు అరెస్టు చేయవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సోషల్‌ మీడియాలో చేసిన అనుచిత పోస్టులు షేర్ చేసిన విషయమై వర్మపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.