అక్షరటుడే, వెబ్డెస్క్ : Waqf Bill | వక్ఫ్ సవరణ బిల్లు-2025 ఉభయ సభల్లో ఆమోదం పొందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) హర్షం వ్యక్తం చేశారు. ఇదో చరిత్రాత్మక మలుపు అని వ్యాఖ్యానించారు. వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు-2025ను కేంద్ర ప్రభుత్వం(Central Government) పట్టుబట్టి ఉభయ సభల్లో గట్టెక్కించుకుంది. బుధవారం లోక్‌సభ(Lok Sabha)లో సుదీర్ఘ చర్చ అనంతరం సభ బిల్లుకు ఆమోదం తెలిపింది.
గురువారం రాజ్యసభలోనూ సుదీర్ఘ చర్చ జరిగింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాల అనంతరం జరిపిన ఓటింగ్‌లో బిల్లుకు ఆమోదం తెలిపింది. దీనిపై తాజాగా ప్రధాని మోదీ(Prime Minister Modi) హర్షం వ్యక్తం చేశారు. ఇదో చారిత్రాత్మక మలుపు అని అభివర్ణించారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థ(Waqf system)లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందన్నారు. తాజా బిల్లు(Latest bill)తో ఇన్నాళ్లుగా అట్టడుగున ఉండిపోయిన వర్గాలకు మేలు చేకూరుతుందని ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు. వారి గళం వినిపించేందుకు అవకాశం దక్కుతుందని తెలిపారు. బిల్లు ఆమోదంతో సామాజిక న్యాయం చేకూర్చడంలో మనం మరో అడుగు ముందుకు వేశామన్నారు.
Waqf Bill | రాజ్యసభలోనూ ఆమోదం..
వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. గురువారం అర్ధరాత్రి దాటే వరకూ బిల్లుపై విస్తృత చర్చ జరిగింది. తీవ్ర వాగ్వాదాల అనంతరం కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiran Rijiju) సభ్యుల అభ్యంతరాలు, ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అనంతరం ఓటింగ్ నిర్వహించగా, బిల్లు(Bill)కు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది ఓటేశారు.
Waqf Bill | కేంద్రం వ్యూహాత్మక అడుగులు..
వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు-2025ను కేంద్ర ప్రభుత్వం పట్టుబట్టి ఉభయ సభల్లో గట్టెక్కించుకుంది. ఈ బిల్లు ప్రవేశపెట్టిన నాటి నుంచి విపక్షాలతో పాటు కొన్ని మైనార్టీ సంఘాలు(Minority communities) తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, ఇక్కడే కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపుతున్నట్లు ప్రకటించింది. జేపీసీ(JPC) నివేదిక రావడంతో బుధవారం లోక్‌సభ(loksabha)లో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. సుదీర్ఘ చర్చకు అవకాశమిచ్చింది. దాదాపు 14 గంటల చర్చ అనంతరం ఓటింగ్(Voting) నిర్వహించగా, బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది ఓటేయడంతో బిల్లుకు ఆమోద ముద్ర పడింది. హోం మంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) ప్రతిపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టారు.