అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండల కేంద్రంలోని రాహుల్ క్లినిక్ ఆస్పత్రి లైసెన్స్‌ను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు క్లినిక్ నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీ రాజుకు సోమవారం మండల వైద్య సిబ్బంది నోటీసులు అందజేశారు. మండల వైద్యాధికారిణి హిమబిందు మాట్లాడుతూ.. పది రోజుల క్రితం ఆస్పత్రిని సీజ్ చేయగా.. సదరు వైద్యుడు తిరిగి వైద్యం అందిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. దీంతో డీఎంహెచ్ వో ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించి సీజ్ నోటీసులు అందజేసినట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ ఫరీదా, సీహెచ్‌వో రమేష్ తదితరులు పాల్గొన్నారు.