అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : ప్రజాపాలన వేడుకలకు కలెక్టరేట్ ముస్తాబైంది. మంగళవారం నిర్వహించనున్న ఈ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 10 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు డీసీపీ కిషన్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, పర్యవేక్షకుడు పవన్ తదితరులున్నారు.