అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : అడవి మామిడిపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులతో అధికారులు నిజామాబాద్ – ఆర్మూర్ మార్గంలో రాకపోకలు నిలిపివేయనున్నారు. ఈనెల 10 నుంచి డిసెంబర్ 10 వరకు వాహనాలను దారి మళ్ళించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వెళ్లే భారీ వాహనాలు డిచ్‌పల్లి జాతీయ రహదారి 44 మీదుగా వెళ్లాలి. అలాగే ఆర్మూర్ నుంచి వచ్చే భారీ వాహనాలు సైతం డిచ్పల్లి హైవే మీదుగా నిజామాబాద్ చేరుకోవాలి. ఆర్టీసీ బస్సులు మాత్రం చిన్నాపూర్, కల్లెడి, ఆలూరు గ్రామాల మీదుగా ఆర్మూర్ చేరుకోవాలి. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.