అక్షరటుడే, బాన్సువాడ: అక్రమ ప్లాట్ల రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం అధికారులను కలిసి మాట్లాడారు. ఫైనల్ లేఅవుట్ అనుమతి లేకుండా లావాదేవీలు జరిగిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఇకపై అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తే పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుంట్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, పాశం భాస్కర్ రెడ్డి, కొనాల గంగారెడ్డి, సాయికిరణ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement