అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: బీడీ వర్కర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మహాసభల్లో కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడిగా చక్రపాణి, అధ్యక్షుడిగా వై ఓమయ్య, ఉపాధ్యక్షులుగా మల్లు భాయ్, కవిత, లక్ష్మి ప్రధాన కార్యదర్శిగా ఎస్ భానుచందర్, సహాయ కార్యదర్శులుగా రేవతి, గాండ్ల రాజవ్వ, సాబేర బేగం, గంగమణి, కోశాధికారిగా డి మహేష్ ఎన్నికయ్యారు. అనంతరం మహాసభల్లో పలు తీర్మానాలు చేశారు. బీడీ పరిశ్రమపై జీఎస్టీ రద్దు చేయాలని, బీడీ కార్మికులకు 26 రోజుల పని కల్పించాలని తీర్మానం చేశారు.