అక్షరటుడే, బాన్సువాడ: ప్రభుత్వం 2007లో పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి హద్దులు చూపెట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు. చందూర్ లోని మర్రి బొగడ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్నారు. వాటికి హద్దులు చూపెట్టాలని సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు వినతిపత్రం అందజేశారు. సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్‌, సాయిబాబా, భూమయ్య, సాయిలు, బాగవ్వ, గంగమణి, విజయ తదితరులు పాల్గొన్నారు.