అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్ లో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అక్కడ వెయ్యి ఎకరాల స్థలం ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2024, సెక్షన్ 93 ప్రకారం.. దశాబ్దంలోగా ఏపీలో గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ హబ్ ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం… ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై తరుచూ చర్చించడంతో ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి.

భారీగా ఉపాధి అవకాశాలు..

ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్ లో గణనీయమైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. పెరుగుతున్న ఇంధన డిమాండ్లను నియంత్రిస్తుంది.