Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రను తిరగరాసింది. 26 సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మోదీ సారథ్యంలో బీజేపీ.. ‘ఆప్’ను ఊడ్చేసింది. 12 ఏళ్ల ఆమ్​ఆద్మీ పార్టీ పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు. మ్యాజిక్​ ఫిగర్​ను అవలీలగా దాటేసి ఢిల్లీలో పాలన సాగించేందుకు బీజేపీ సిద్ధమైంది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాల్లో బీజేపీ పాగా వేయగా.. 22 స్థానాల్లో ఆమ్​ ఆద్మీపార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఢిల్లీలో మోదీ డబుల్​ ఇంజిన్​ సర్కారు నినాదం బలంగా ప్రజల్లోకి వెళ్లిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా బీజేపీకి దళిత, ఓబీసీ ఓటర్ల మద్దతు లభించింది.

విడిగా పోటీ చేసి దెబ్బతిన్న కాంగ్రెస్, ఆప్

ఢిల్లీలో ఆమ్​ఆద్మీ పార్టీ, కాంగ్రెస్​ పార్టీలు విడివిడిగా పోటీ చేయడం బాగా దెబ్బతీసిందని.. దీంతో బేజేపీ లాభపడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు లిక్కర్​స్కాం, శీష్​ మహల్​ అంశాలు సైతం ఆప్​ ప్రతిష్టను మసకబారేలా చేశాయని పేర్కొంటున్నారు.

Advertisement