అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: డిచ్‌పల్లి మండలంలోని ధర్మారం-మెట్‌పల్లి రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రోడ్డు పక్కన మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి చేతిపై ‘నీతా రమేశ్ గవాతే – నాందేడ్ – కొండిబా’ అని పచ్చబట్టు ఉంది. అలాగే ఒంటిపై బ్లాక్ అండ్ వైట్ రంగు షర్ట్, బ్లాక్ కలర్ నైట్ ప్యాంట్ ఉన్నాయి. ఎవరికైనా మృతుడి వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని డిచ్‌పల్లి పోలీసులు కోరారు.