Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం సాయంత్రం ప్రారంభం కానున్నాయి. పాంచరాత్రాగమ విధానాలతో 11 రోజుల పాటు వైభవంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నెల 11 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇందుకోసం ఆలయాన్ని ముస్తాబు చేశారు. భక్తులకు అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఈవో భాస్కర్ రావు తెలిపారు.
ఉత్సవాల వివరాలు..
- మార్చి 1న విశ్వక్సేనా ఆళ్వార్లకు తొలిపూజ జరిపి సాయంత్రం బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు.
- 2న ధ్వజారోహణం ఉంటుంది.
- 3న ఉదయం మత్స్యావతార అలంకార శేవ, వేదపారాయణము, రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ ఉంటాయి.
- 4న వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ నిర్వహిస్తారు.
- 5న కృష్ణాలంకార సేవ, రాత్రి పొన్న వాహన సేవ ఉంటాయి. 7న రాత్రి ఎదుర్కోలు వేడుక నిర్వహించనున్నారు.
- 8న రాత్రి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం ఘనంగా జరుపుతారు.
- 9న రాత్రి 8 గంటలకు దివ్యవిమాన రథోత్సవం.
- 11న గర్భాలయంలోని మూల విరాట్‌కు సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
Advertisement