అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలం అన్నారెడ్డిపల్లికి వెళ్లే వంతెన తెగిపోయి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలతో భారీగా వరద రావడంతో బ్రిడ్జి కొట్టుకుపోయింది. వంతెన శిథిలావస్థకు చేరుకుందని నూతన వంతెన నిర్మించాలని గతంలోనే కోరినా.. ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోయారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మించాలని కోరారు.