అక్షరటుడే, జుక్కల్/కామారెడ్డి టౌన్/బాన్సువాడ: ప్రజా భవన్ ముట్టడికి వెళ్లకుండా జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. షరతులు లేకుండా రైతులందరికీ రూ.రెండు లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రజా భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో జిల్లా నుంచి తరలి వెళ్లకుండా నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో కామారెడ్డి నాయకులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మల్లన్నగారి భూంరెడ్డి, గెరిగంటి లక్ష్మీనారాయణ, అన్నారం, నరేశ్ రెడ్డి, బిచ్కుందలో వెంకట్రావు దేశాయ్, గణేశ్, దుర్గారెడ్డి, రమేశ్ గౌడ్, బాన్సువాడలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ జుబేర్, తదితరులున్నారు.