Nizamabad | అమ్రాద్​ తండాలో కత్తిపోట్ల కలకలం
Nizamabad | అమ్రాద్​ తండాలో కత్తిపోట్ల కలకలం
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్ః 

Advertisement
నవమాసాలు మోసి.. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తే.. మాతృప్రేమను మరిచిన ఆ కసాయి కొడుకు.. చివరకు కన్నతల్లికే శాపంగా మారాడు. విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి తల్లిని పొట్టనపెట్టుకున్నాడు.

సంగారెడ్డి జిల్లాలో జ‌రిగిన ఈ ఘటన కలకలం రేపింది. తెల్లాపూర్ మున్సిపల్ పరిధి డివినో విల్లాస్‌లో ఈ దారుణ ఘటన జరిగింది.

CRIME : ఆస్తి కోసం.. ఘాతుకం

తాగుడుకు బానిస అయిన నవారు కార్తీక్ రెడ్డి(26) సోమవారం ఉదయం తన తల్లి రాధిక(52) పై కత్తితో దాడి చేసి కిరాతకంగా చంపేశాడు. ఆస్తి తన పేరున రాయాలని, అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ మద్యం మత్తులో తల్లిపై కత్తితో దాడి చేశాడు.

తీవ్రంగా గాయపడిన రాధికను కుటుంబ సభ్యులు వెంటనే సిటిజన్ ఆసుపత్రికి తరలిచగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.