అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bald head | దేశవ్యాప్తంగా బట్ట, పొట్టతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. బట్టతల ఉన్న యువకులు బయటకు వెళ్లాలంటే ఆలోచిస్తారు. టోపీలు(Caps), విగ్‌లు(Vigs) ధరించి పలువురు బట్టతల కనిపించకుండా చూసుకుంటారు. ఇక పొట్ట ఉన్న వారి సంగతి చెప్పనక్కర్లేదు. నలుగురిలో తమ పొట్టను కవర్ చేసుకోవడానికి నానా తిప్పలు పడుతుంటారు.
అయితే వీరు బట్టతల(Bald head), పొట్ట పోగొట్టుకోడానికి అనేక తిప్పలు పడుతుంటారు. వీరి బాధను ఆసరాగా తీసుకొని పలువురు మోసం చేస్తున్నారు. బట్టతలపై వెంట్రుకలు తెప్పిస్తామని, నెల రోజుల్లో పొట్ట తగ్గిస్తామని డబ్బులు తీసుకుని పరారవుతున్నారు. తాజాగా ఇలాంటి ఉదంతం ఒకటి హైదరాబాద్(Hyderabad)లో చోటు చేసుకుంది.
Bald head | సైడ్ ఎఫెక్ట్స్‌తో ఆస్పత్రులకు..
బట్టతలపై జుట్టు తెప్పిస్తామంటూ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ప్రచారం చేశాడు. హైదరాబాద్ పాతబస్తీ ఫతే దర్వాజా(Hyderabad Old City Fateh Darwaza) కేంద్రంగా ఉన్న తన మిత్రుడి సెలూన్(Salon)కు రావాలని బట్టతల ఉన్న వారికి సూచించాడు. ఢిల్లీకి చెందిన బిగ్‌బాస్ పార్టిసిపెంట్(Bigg Boss participant)కి బట్టతలపై జుట్టు రప్పించానని నమ్మించాడు. దీంతో ఎంతోమంది బట్టతల బాధితులు ఆయన సెలూన్(Salon)కు వెళ్లారు. వారి దగ్గర డబ్బులు వసూలు చేసిన నిందితుడు గుండు గీసి పలు రసాయనాలు పూశాడు. జుట్టు రావడం మాని కొత్తగా సైడ్ ఎఫెక్ట్స్(Side effects) రావడంతో యువకులు లబోదిబోమంటూ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.