Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఓలా, ఉబర్ సంస్థలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. క్యాబ్ బుక్ చేసుకునే ఫోన్ల మోడల్ ఆధారంగా రేట్లు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. ఐఫోన్‌లో రైడ్ బుక్ చేస్తే ఒక రేటు, ఆండ్రాయిడ్ ఫోన్‌లో బుక్ చేస్తే మరో రేటు ఉంటోందని, ఒకే రకమైన సేవకు వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ సంస్థలకు నోటీసులు జారీ చేసి.. సత్వరమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Advertisement