అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టే కురుక్షేత్రంలో అధర్మం ఓడిందని, మనం ధర్మంవైపు నిలబడితే ధర్మమే గెలిపిస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన తెలంగాణ సదర్‌ సమ్మేళనం కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. మూసీలో నరకం అనుభవిస్తున్న ప్రతి పేదవాడి జీవితంలో వెలుగునిద్దామన్నారు. ఉద్యోగ, విద్యా అవకాశాలు కల్పించాలనేది కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేసి పరివాహక ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర ఎవరు కాదలేనిదన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం సదర్‌ సమ్మేళనం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ యాదవులకు సముచిత స్థానం కల్పిస్తోందన్నారు. హైదరాబాద్‌ నగర మూలపురుషులు యాదవులు అని అన్నారు. రాబోయే రోజుల్లో యాదవులను నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుందన్నారు. అవకాశం ఇచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Tokyo Waterfront | టోక్యో వాటర్‌ ఫ్రంట్‌ స్టైల్​లో మూసీ రివర్!