MLC Kavitha | రాబోయే రోజులు బీఆర్​ఎస్​వే.. : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | రాబోయే రోజులు బీఆర్​ఎస్​వే.. : ఎమ్మెల్సీ కవిత

అక్షరటుడే, నిజాంసాగర్: MLC Kavitha | బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసికట్టుగా ఉండాలని.. రాబోయే రోజులు మనవేనని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పేర్కొన్నారు. సోమవారం ఆమె బాన్సువాడ(Banswada)లో జరిగే ఇఫ్తార్ విందుకు వెళ్తూ.. మార్గమధ్యంలో నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి చౌరాస్తా వద్ద ఆగారు. బీఆర్​ఎస్​ నాయకు(BRS leaders)లు ఆమెకు స్వాగతం పలికారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారందరికీ తాము రుణపడి ఉంటామన్నారు. మాజీ సీడీఎస్​ ఛైర్మన్,​ నిజాంసాగర్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి(Durga Reddy) ఆమెకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

Advertisement
Advertisement

జాతీయ రహదారిపై నిజాంసాగర్ మండల బీఆర్ఎస్ (BRS) నాయకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు గైని విఠల్, మనోహర్, రమేష్ గౌడ్ రమేష్, సత్యనారాయణ, రాజు, అంజయ్య, శ్రీకాంత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, గోరేమియా సాయిలు, సుభాష్ గౌడ్ తదితరులున్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  KTR | కేటీఆర్​పై కేసు నమోదు