Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఢిల్లీ లిక్కర్​ స్కాంలో విస్తుపోయే ఘటనలు జరిగాయని కంప్ట్రోలర్ అండ్​ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) రిపోర్ట్​లో గుర్తించింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ అసెంబ్లీలో సీఎం రేఖాగుప్తా కాగ్​ రిపోర్ట్​ను బయటపెట్టారు. దీనిపై ఆప్​ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. కాగా.. వారిని స్పీకర్ అసెంబ్లీ నుంచి​ ఒకరోజు సస్పెండ్​ చేశారు.

కాగ్​ రిపోర్ట్​లో ఏముందంటే..

ఢిల్లీ లిక్కర్​ పాలసీపై కాగ్​ రిపోర్ట్​ ఇచ్చింది. పాలసీ కారణంగా ప్రభుత్వానికి రూ.2,002 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొంది. ఢిల్లీలో అధికారంలోకి వచ్చాక ఆప్(AAP)​ ప్రభుత్వం కొత్త లిక్కర్​ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీని అడ్డం పెట్టుకుని అప్పటి సీఎం అరవింద్​ కేజ్రీవాల్​, డిప్యూటీ సీఎం మనీష్​ సిసోడియా తదితరులు లబ్ధి పొందారనే అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విచారించిన కోర్టు సీఎం, డిప్యూటీ సీఎంలను అరెస్ట్​ చేయాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే విధంగా పాలసీని అమలు చేయడం ద్వారా భారీ నష్టం వాటిల్లిందని వారిపై సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది.

లిక్కర్​ స్కాం.. భారీ అవినీతి..

ఢిల్లీలో లిక్కర్ పాలసీ రూపకల్పనలో భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి, అతని సహచరుడు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌తో సహా ఆప్ అగ్రనేతల అరెస్టులకు ఈ స్కాం దారితీసింది. అలాగే ఇదే లిక్కర్​ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం జైలుకు వెళ్లారు. దాదాపు ఆరు నెలలు ఆమె తీహార్ జైలులో రిమాండ్ పై ఉన్నారు. ఈ లిక్కర్ స్కాం కారణంగానే తెలంగాణలో గులాబీ పార్టీ అధికారం కోల్పోయింది. తాజాగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సైతం అధికారాన్ని కోల్పోగా.. అక్కడి ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టారు.

Advertisement