అక్షరటుడే, ఇందూరు: mla dhanpal | రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలను పట్టించుకోవట్లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా(mla dhanpal surya narayana guptha) ధ్వజమెత్తారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చౌక్‌లో రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చేసిన హామీని విస్మరించారన్నారు.
పంటలకు నీరు లేక రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీ పున:ప్రారంభంపై ప్రభుత్వ మౌనంగా ఉందని చెప్పారు. వరి కోతలు ప్రారంభమైనందున వెంటనే ఐకేపీ కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లారీలు, బస్తాలు తదితర సదుపాయాలు సమకూర్చాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.2లక్షల రుణమాఫీ, రూ.15వేల రైతు భరోసా, రూ.500 బోనస్ వెంటనే అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు, కిసాన్ మోర్చా జిల్లా, రాష్ట్ర నాయకులు రైతులు పాల్గొన్నారు.