అక్షరటుడే, కామారెడ్డి : ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ షాకిచ్చింది. ఆయనకు పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి టీపీసీసీ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రభుత్వానికి, ప్రభుత్వ పథకాలకు, పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రోటోకాల్ పాటించకుండా గ్రూప్ రాజకీయాలకు తెరలేపడంతో పాటు ఆరు గ్యారంటీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు నోటీసు జారీ చేసినాట్లు పేర్కొన్నారు. అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో అక్కడి క్యాడర్ మనోభావాలు దెబ్బతినేలా సుభాష్ రెడ్డి వ్యవహరించారన్నారు. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.