అక్షరటుడే, వెబ్డెస్క్: డిసెంబర్ 1 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీజేపీ పాదయాత్ర చేపట్టనుంది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అమలు చేయకపోవడంతో నిరసిస్తూ ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈనెల 15 లేదా 16న మూసీ పరివాహక ప్రాంతాల్లో రాత్రివేళల్లో బసచేయాలని బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు.