అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అజ్ఞాతంలో ఉన్న ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కదురైంది. తనకు ముందస్తు బెయిల్‌ కావాలని వేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. దీంతో ఆయన మరింత కష్టాల్లో పడ్డట్లయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌లపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న అభియోగంపై ఆర్జీవీపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.