అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: మద్యం తాగి వాహనాలు నడిపిన కేసుల్లో ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. మద్యం తాగి బైక్ నడిపిన ఐదుగురిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా.. నరసింహారెడ్డి, జైపాల్‌కు రెండు రోజుల జైలు శిక్ష విధించారు. అభిషేక్, పోశెట్టి, అఫ్రోజ్‌లకు ఒకరోజు జైలుశిక్ష విధించారు. అలాగే మరో 14 మందికి రూ. 21,000 జరిమానా వేశారు.
డ్రంకన్ డ్రైవ్ కేసులో ఐదుగురికి జైలు
Advertisement
Advertisement