Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఢిల్లీ-కత్రా ఎక్స్‌ప్రెస్ వే హర్యానా పరిధిలో వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి అమృత్‌సర్ మీదుగా కత్రా వరకు 669 కిలోమీటర్ల మేర కేంద్ర ప్రభుత్వం హైవే నిర్మిస్తుంది. కైతాల్ జిల్లాలోని కున్లి మనేసర్ పల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే నుంచి పంజాబ్ సరిహద్దు వరకు 135 కిలోమీటర్ల మార్గం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయి. పంజాబ్‌లో ఈ రోడ్డు నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ 135 కిలోమీటర్ల మేర టోల్ వసూలు ప్రారంభమైంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఢిల్లీ నుంచి కత్రాకు ఆరు గంటల్లో చేరుకోవచ్చు.

Advertisement