అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు తీవ్ర నిరసన సెగ ఎదురైంది. దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం సోమవారం గ్రామస్థులతో అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇందుకోసం కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌తో పాటు కొడంగల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారి, ఇతర అధికారులు వెళ్లగా.. గ్రామస్థులు తీవ్ర నిరసన తెలిపారు. అనంతరం ఆగ్రహంతో కలెక్టర్‌ వాహనంతో పాటు కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. అలాగే కొడంగల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారిపై దాడి చేశారు. దీంతో వాహనాల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భయాందోళనకు గురైన అధికారులు వాహనాల్లో వెంటనే తిరిగివెళ్లిపోయారు.

Advertisement
Advertisement
Advertisement