అక్షరటుడే ఇందూరు: ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో అండర్-17 టోర్నీలో జిల్లా బాలికల జట్టు విజేతగా నిలిచింది. నల్గొండ జట్టుపై మూడు పాయింట్ల తేడాతో గెలిచి ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. జట్టుకు కోచ్ కం మేనేజర్లుగా పీడీలు సంతోషి, కల్పన, అశోక్ వ్యవహరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగమణి అభినందనలు తెలిపారు.