అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. గత సెషన్‌లో కాస్త పుంజుకోగా.. మంగళవారం మళ్లీ మొదటికొచ్చాయి.. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైనా కొద్దిసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్, భారతీయ ఎయిర్ టెల్, బజాజ్ ఆటో, అదానీ గ్రూప్ షేర్లు నష్టాల్లో ఉండగా.. ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా.. టాటా, బజాజ్, అదానీ గ్రూప్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.