అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం మళ్లీ నష్టాలబాట పట్టాయి. ఉదయం లాభాలతోనే ప్రారంభమైనా కొద్దిసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. ఇంట్రాడేలో టాటా కాన్సుమర్ 8 శాతం, కోటక్ బ్యాంక్ 5 శాతానికి పైగా నష్టపోయాయి. బజాజ్ ఆటో, ఐచర్, మారుతి, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, విప్రో వంటి షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఇండస్ ఇన్డ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఆదానీ ఎంటర్ప్రైజెస్, ఆదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఓఎన్ జీసీ, ట్రెంట్ వంటి పేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.